News February 28, 2025
మార్చి 2న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు మార్చి 2న సూర్యాపేటలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగ పోటీల గురించి సాధకులతో కలిసి మాట్లాడారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తవేతకు రంగం సిద్ధం!

ఈ నెల 10వ తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News July 7, 2025
సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై దాడులు

సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో ఆదివారం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ దాడుల్లో ఓ నిర్వాహకురాలితోపాటు, ఇద్దరు మహిళలు, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News July 7, 2025
వరంగల్: కోరికలు తీరాలని తాళం వేస్తారు!

ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. అలాగే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా దర్శనానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలని దర్గాలోని గ్రిల్స్‌కు తాళం వేస్తారు. కోరికలు నెరవేరిన అనంతరం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకతీతంగా వచ్చే భక్తులు ఈ ఆనవాయితీని పాటిస్తుండటం విశేషం. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు కిక్కిరుస్తారు.