News February 28, 2025

అంకెల గారడీ.. అమలు శూన్యం: తిరుపతి MP 

image

రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని MP మండిపడ్డారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనిపించేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతుందనే వాస్తవాలను ఈ బడ్జెట్‌ చెప్పకనే చెబుతుందని MP అన్నారు.

Similar News

News September 14, 2025

ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

image

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

News September 14, 2025

జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

image

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.

News September 14, 2025

VKB: టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్‌ కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న మోమిన్‌పేటలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ బోధించడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. ఎంఎస్సీ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 16న నిర్వహించే ఇంటర్వ్యూ, డెమో క్లాస్‌కు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 6301013028, 7981718918ను సంప్రదించాలని సూచించారు.