News February 28, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 9న ఆయన ప్రధానితో సహా పలు పార్టీ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు సమాచారం. అంతకుముందు మార్చి 6న రాష్ట్ర కేబినెట్ భేటీ అయి ఈ బిల్లుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
Similar News
News March 1, 2025
అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.
News March 1, 2025
మాకు శాశ్వత శాంతి కావాలి: జెలెన్‌స్కీ

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.
News March 1, 2025
WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.