News February 28, 2025
జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఆకస్మిక తనిఖీ

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్, నోడల్ అధికారులందరూ జిల్లాలోని వివిధ మండలాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. వాటిల్లోని పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందించాలని కోరారు.
Similar News
News March 1, 2025
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మార్చ్ 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967, ఒకేషనల్ 848 మొత్తం 4,815 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5,739, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 1, 2025
రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.
News March 1, 2025
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి మోసం చేస్తారని అన్నారు.