News March 22, 2024
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నేపథ్యం..

మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాక) మనవడు వంశీకృష్ణ. వంశీకి భార్య రోష్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన 2010లో అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ పట్టా పొందారు. కాకా కుటుంబంలోని 3వ తరానికి చెందిన వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నారు. తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎఎమ్మెల్యేగా ఉండగా కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ బరిలో నిలిచారు.
Similar News
News September 7, 2025
కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.
News September 6, 2025
ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
News September 6, 2025
జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రథమ ర్యాంకు

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు, జోనల్ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 2-4 మధ్య తమిళనాడు వెల్లూరులో జరిగిన అటారీ వార్షిక సమీక్షలో ఈ గౌరవం దక్కింది. డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు అవార్డు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు శాస్త్రవేత్తల బాధ్యతను పెంచిందని, రైతులకు మరింత సేవలు అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.