News February 28, 2025
మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News March 1, 2025
NZB: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలోని ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SHO రఘుపతి శుక్రవారం తెలిపారు. పూసల గల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్ (41) గత కొన్ని సంవత్సరాలుగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News March 1, 2025
బాసర: జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థి కె.వెంకటేశ్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు కలింగ, హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో ఆర్జీయూకేటీ విద్యార్థి వెంకటేశ్ ఎంపికవడంపై వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News March 1, 2025
సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్

AP: నటుడు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపర్చారు. YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని పోసాని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్ SMలో వైరల్ చేసేవాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే HYDలో ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు.