News February 28, 2025
మొలకలచెరువు వద్ద మృతదేహం కలకలం.!

మొలకలచెరువు సరిహద్దులోని చీకటి మానుపల్లి పేపర్ మిల్లు వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ములకలచెరువు SI నరసింహుడు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45ఏళ్ళ గుర్తుతెలియని వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. ఛాతిపై పి.బాబాజాన్ అనే పచ్చబొట్టు కలిగి, నీలిరంగు షర్ట్ ధరించాడని తనకల్లు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.
News March 1, 2025
నిర్మల్: రంజాన్ మాసంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎస్పీ

రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ముస్లిం సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలను అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు.
News March 1, 2025
ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.