News February 28, 2025
వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.
News March 1, 2025
ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.
News March 1, 2025
సజ్జల డైరెక్షన్‌లోనే పవన్, లోకేశ్‌ను తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్

AP: నటుడు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపర్చారు. YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని పోసాని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్ SMలో వైరల్ చేసేవాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే HYDలో ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు.