News March 22, 2024
INSTAGRAM మళ్లీ పనిచేయట్లేదు!

ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదని కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘ఉదయాన్నే మొబైల్‌లో ఇన్‌స్టా ఓపెన్ చేయగానే లాగౌట్ అయింది. తిరిగి ప్రయత్నిస్తే పాస్‌వర్డ్ చేంజ్ చేశారని నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ ప్రయత్నిస్తే అసలు తమ అకౌంటే లేదని చూపిస్తోంది’ అని పోస్టులు పెడుతున్నారు. దీంతో INSTAGRAM DOWN హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీకూ ఇలానే అవుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News December 25, 2025
ఇకపై ‘కామెలియా సినెన్సిస్’ ఆకులతో చేసేదే టీ!

కేవలం ‘కామెలియా సినెన్సిస్’ (టీ మొక్క శాస్త్రీయ నామం) ఆకులతో చేసే డ్రింక్‌ను మాత్రమే ‘Tea’ అనాలని FSSAI స్పష్టం చేసింది. హెర్బల్ టీ, ఫ్లవర్ టీ లేదా రూయిబోస్ టీ వంటి డ్రింక్స్‌కు ‘టీ’ అనే ట్యాగ్ వాడటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలిపింది. ఇకపై ఇలాంటి డ్రింక్స్‌ను ‘Tea’గా కాకుండా ఇతర పేర్లతో విక్రయించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
News December 25, 2025
ఇతిహాసాలు క్విజ్ -107 సమాధానం

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
సమాధానం: ఆయన శ్రీమహావిష్ణువు ధరించిన నరసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుడిని తండ్రి హిరణ్యకశిపుడి క్రూరత్వం నుంచి కాపాడటానికి స్వామి ఈ రూపం దాల్చారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 25, 2025
Money Tip: జీతం పెరిగినా జేబు ఖాళీనా? ‘లైఫ్‌స్టైల్ క్రీప్’లో పడ్డట్టే!

ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరగడాన్ని ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ అంటారు. జీతం పెరగ్గానే లగ్జరీ వస్తువులు కొనడం, ఖరీదైన అలవాట్లు చేసుకోవడం వల్ల పొదుపు తగ్గుతుంది. భవిష్యత్తు కోసం దాచుకోవాల్సిన సొమ్ము విలాసాలకే ఖర్చవుతుంది. ఈ మార్పు మనిషికి సంపదను దూరం చేస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించి, పెరిగిన ఆదాయాన్ని పెట్టుబడిగా మలచడం ముఖ్యం. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు.


