News March 22, 2024

MBNR: ఓ వైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు ఫిరాయింపులు

image

ఇటు పార్లమెంట్.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఒకవైపు ప్రచార ఆర్భాటాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు చేరికల తతంగం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇక మరికొంతమంది మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

Similar News

News November 17, 2024

MBNR: TGPSCకి వినతి పత్రం ఇచ్చిన అభ్యర్థులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు గ్రూప్-4 అభ్యర్థులు ఆదివారం రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కలిశారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో తమకంటే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థులకు జాబ్ వచ్చిందని.. మార్కులు ఎక్కువ ఉన్నప్పటికీ తాము జాబ్ కోల్పోయామన్నారు. ఏ పద్ధతిన సెలక్షన్ ప్రాసెస్ జరిగిందో తెలిపాలని వారు బోర్డుకు వినతి పత్రాన్ని అందించారు.

News November 17, 2024

NGKL జిల్లాలో కారు బీభత్సం.. ఒకరు మృతి

image

పెద్దకొత్తపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. NGKL నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా కుడికిల్ల‌కి చెందిన నిరంజనమ్మ కల్వకోల్ గ్రామం రహదారి వద్ద కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పరార్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

News November 17, 2024

MBNR: గ్రూప్‌-3 అభ్యర్థులకు సూచనలు..

image

✓అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఏ-4 సైజ్‌ కలర్‌ ప్రింట్‌ తీసుకోవాలి. ✓హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అతికించాలి. ✓హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌తో 3పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతోపాటు, వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు అందించాలి. ✓బ్లూ,బ్లాక్ బాల్ పెన్ ఉపయోగించాలి✓ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.