News February 28, 2025
తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ స్పోర్ట్స్ కోటాలో TTDలో ఉద్యోగాల భర్తీకి చర్యలు
✒ తిరుపతిలో అర్ధరాత్రి బ్యూటీపార్లర్‌లో అగ్ని ప్రమాదం
✒ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి హన్సికా
✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి MP విమర్శలు
✒ తిరుపతి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ ఈవో
✒ శ్రీకాళహస్తి RDO ఆఫీస్ వద్ద ధర్నా
Similar News
News November 11, 2025
GWL: రేబిస్ వ్యాధిపై అవగాహన ముఖ్యం

రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని మంగళవారం గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. రేబిస్ సోకే విధానం, నివారణ జాగ్రత్తలు, వీధి కుక్కలు కరిస్తే ప్రాథమిక చికిత్స అందించాల్సిన విధానం గురించి విద్యార్థులకు వివరించారు.
News November 11, 2025
అయిజ: ‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, SI తరుణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఉత్తనూర్ ZPHS ప్రాంగణంలో మంగళవారం SGF జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 బాస్కెట్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.
News November 11, 2025
రాంబిల్లి: 106 ఎకరాల్లో రూ.1175 కోట్లతో పరిశ్రమ

బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.1175 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్.కె అగర్వాల్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ రాంబిల్లి మండలంలో కృష్ణంపాలెంలో మంగళవారం ఆయన పర్యటించారు. వచ్చే సంవత్సరంలో దీపావళి నాటికి రూ.605 కోట్లతో ఫేజ్-1 పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.


