News March 1, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
Similar News
News November 2, 2025
MBNR: SSC విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆదేశాల మేరకు SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల సమయ పట్టికను రూపొందించామని డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల విద్యాప్రగతిని పెంపొందించి రాబోయే SSC పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉదతయం 8:15 నుంచి 9:15 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు క్లాసులు జరుగుతాయని పేర్కొన్నారు.
News November 1, 2025
MBNR: విద్యుత్ షాక్‌తో డిగ్రీ విద్యార్థి మృతి

కరెంటు షాక్‌తో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్‌లో నిన్న రాత్రి జరిగింది. కుటుంబసభ్యులు వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి, తుల్జానాయక్‌కు కుమారుడు కార్తీక్, ఓ కుమార్తె ఉన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి కార్తీక్ నీరు పడుతుండగా కరెంట్ షాక్ గురయ్యాడు. స్థానికులు గుర్తించి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
News October 31, 2025
బాదేపల్లి మార్కెట్‌లో పంట ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం మొక్కజొన్న 2,695 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,007, కనిష్ఠ ధర రూ.1,600 పలికింది. ఆర్‌ఎన్‌ఆర్ వడ్లు 130 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.2,089, కనిష్ఠ ధర రూ.1,739గా నమోదైంది. జొన్నలు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,701, రాగులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.3,777 లభించాయి.


