News March 1, 2025
వరంగల్ రైల్వే స్టేషన్‌ను రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి

వరంగల్ రైల్వే స్టేషన్‌ను రూ 25.41 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రైలు వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యం అందించడానికి శర వేగంగా పనులు కొనసాగుతున్నాయని, ఈ స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు, సౌకర్యాల జోడించడంతో సహా అనేక విస్తరణలు, ఆధునికీకరణ చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News March 1, 2025
భద్రాద్రి: ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణలు శుక్రవారం లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.
News March 1, 2025
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST