News March 1, 2025
నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ✓వెల్దండ మండలం గుండాలలో కోనేరులో గల్లంతైన ఓమేష్ మృతదేహం లభ్యం.✓నాగర్ కర్నూలు జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓కొల్లాపూర్ లోని సింగోటంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.✓జిల్లాలో..నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓బల్మూరు మండలంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.
Similar News
News March 1, 2025
గుంటూరు: హైవేపై యాక్సిడెంట్.. దుర్మరణం

వెంకటప్పయ్య కాలనీ వీఐపీ రోడ్డు చివర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా లేక మృతిచెందిన ఇతడే వాహనాన్ని ఢీకొట్టాడా అనేది తెలియాల్సి ఉంది.
News March 1, 2025
VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
News March 1, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి 2 ఏళ్లు జైలు: పార్వతీపురం SP

హత్యాయత్నం కేసులో నిందితునికి రేండుళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి తెలిపారు. 2022 మే 19 న పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో జరిగిన గొడవలో బి.రాము తన భార్యపై అనుమానంతో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గొడవపడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతోపాటు రూ. 500 జరిమానా కోర్టు విధించింది.