News March 1, 2025
వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.
Similar News
News March 1, 2025
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: భూపాలపల్లి కలెక్టర్

సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11, మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.

ఒంగోలు: బాలికను గర్భవతిని చేశాడు.. పరారయ్యాడు

తన పిన్ని కూతురు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లుగా నమ్మించి ఆరిఫ్ బాలికను తన గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువకుడు పరారయ్యాడు. ఒంగోలులో ఓ బాలిక తన స్నేహితుడి ద్వారా పరిచయమైంది. బాలికపై కన్నేసిన యువకుడు ఇన్స్టాగ్రామ్‌లో రోజూ చాట్ చేస్తూ పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.