News March 1, 2025

యాదగిరి శ్రీవారి నిత్య ఆదాయం ‘రూ.19,09,151’

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 728 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా మ కళ్యాణ కట్ట ద్వారా రూ.36,400, ప్రసాద విక్రయాలు రూ.7,42,750, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,12,500, కార్ పార్కింగ్ రూ.191,500, యాదరుషి నిలయం రూ.33,114, అన్నదానం రూ.1,06,061, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.19,09,151 ఆదాయం వచ్చింది.

Similar News

News September 15, 2025

అక్టోబర్ 4న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం: కలెక్టర్

image

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 4న ఉదయం 10:30కు జరుగుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. MHBD పట్టణం కొత్త బజార్‌లోని లయన్స్ భవన్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం హాజరై ఎజెండాలోని పలు అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News September 15, 2025

స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.