News March 1, 2025
శివరాంపల్లి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును పరిశీలించిన హైడ్రా కమిషనర్

శివరాంపల్లిలో శుక్రవారం రాత్రి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో సరస్సు అభివృద్ధి పనుల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని సరస్సులను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్‌లో టూరిస్టులు అధికంగా జూ పార్క్‌కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT
News March 1, 2025
మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.
News February 28, 2025
TG కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్‌ను కలిసిన ఆరోగ్య శాఖ మంత్రి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇందిరా భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో వీరు పాల్గొన్నారు.