News March 1, 2025

శుభ ముహూర్తం (01-03-2025)

image

☛ తిథి: శుక్ల పాడ్యమి, తె.5.30 వరకు
☛ నక్షత్రం: పూర్వాభాద్ర, మ.1.46 వరకు
☛ శుభ సమయం: సా.4.45 నుంచి 5.33 వరకు
☛ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-నుంచి 7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.46 నుంచి 12.16 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.6.38 గంటల నుంచి 8.08 వరకు

Similar News

News March 1, 2025

భారత్‌లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం

image

భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

News March 1, 2025

నేడు చిత్తూరు జిల్లాలో CM చంద్రబాబు పర్యటన

image

AP: CM చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి విజయవాడకు తిరుగు పయనమవుతారు. మరోవైపు, మంత్రి లోకేశ్ ఇవాళ మంత్రాలయంలో పీఠాధిపతి చేతుల మీదుగా గురువైభోత్సవం అవార్డు అందుకోనున్నారు.

News March 1, 2025

ఇవాళ టీవీ, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇవాళ టీవీ, ఓటీటీలోకి రానుంది. సా.6గంటలకు జీతెలుగు ఛానల్‌లో, జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

error: Content is protected !!