News March 22, 2024
సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 15, 2025
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. సంగారెడ్డి ఓఆర్ఆర్ పై టెంపో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మాదయ్య మృతి చెందాడు. కొల్లూరులో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభాకర్ మృతి చెందగా, పుల్కల్లో జరిగిన యాక్సిడెంట్లో అల్లాదుర్గం(M)కు చెందిన జర్నయ్య బైక్ పై వస్తూ లారీని ఢీకొట్టి మృతి చెందాడు. కొండపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి అనిల్ మృతి చెందాడు.
News April 15, 2025
సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

భార్యను భర్త <<16097179>>హత్య చేసిన<<>> ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.
News April 15, 2025
మెదక్: కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. ఎస్ఐ లింగం వివరాలు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయమ్మ నాలుగేళ్ల కొడుకుతో రాయరావు చెరువులోకి దిగుతుండగా వాచ్మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి తల్లి, కొడుకును రక్షించి PSకు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని జయమ్మ తెలిపిందని ఎస్ఐ వెల్లడించారు.