News March 1, 2025

మహబూబాబాద్: ప్రభుత్వ వసతి గృహాల్లో కలెక్టర్ తనిఖీ 

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అందిస్తున్న భోజన మౌలిక సౌకర్యాలను గురించి ఆరా తీశారు. స్టడీ అవర్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చదవాలని, 100% ఫలితాలు సాధించాలని అన్నారు.

Similar News

News November 6, 2025

HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

image

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 6, 2025

TG SETకు దరఖాస్తు చేశారా?

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <>TG SE<<>>T-2025 దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులో తప్పుల సవరణ నవంబర్ 26 నుంచి 28 వరకు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/