News March 1, 2025

GWL: పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ బియం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే లాగా చేయాలని అన్నారు.

Similar News

News July 7, 2025

HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

image

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.

News July 7, 2025

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో మార్పులు

image

లార్డ్స్‌లో ఈనెల 10 నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టుకు ఇంగ్లండ్ 16 మందితో జట్టును ప్రకటించింది. పేసర్ అట్కిన్సన్ స్క్వాడ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచులో ENG 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఆర్చర్, అట్కిన్సన్‌, బెథెల్ తుది జట్టులో ఆడే ఛాన్సుందని ICC అంచనా వేసింది.
టీమ్: స్టోక్స్(C), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, రూట్, పోప్, స్మిత్, ఓవర్టన్, బ్రూక్, కుక్, కార్స్, క్రాలీ, డకెట్, టంగ్, వోక్స్

News July 7, 2025

జగిత్యాల జిల్లాలో 66 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.