News March 1, 2025
నవోదయం 2.0 కరపత్రాలు విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు. జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమంపై కలెక్టర్ గోడ పత్రికలు విడుదల చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం: ‘మాకు స్తోమత లేదు.. అక్కడే పూడ్చండి’

పొట్టకూటి కోసం వేలాది మైళ్ల దూరం నుంచి వచ్చిన ఆ వలస కూలీకి చివరకు సొంతూరి మట్టి కూడా కరవైంది. బిహార్‌కు చెందిన రాజన్‌రామ్ పందిళ్లపల్లి సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అంత దూరం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. దీంతోఅన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
News January 22, 2026
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.
News January 22, 2026
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ జగన్‌దే: జడ్పీ ఛైర్మన్ మజ్జి

విజయనగరంలో బుధవారం జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని, మెజారిటీ భూ నిర్వాసితులు వైసీపి సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.


