News March 1, 2025
సీఎస్ వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలోని CS కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. పెన్షన్లు, MSME సర్వే, ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పథకానికి భూమి కేటాయింపు తదితర అంశాలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. తక్షణమే వీటిపై తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు సూచించారు.
Similar News
News March 1, 2025
అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త

టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి 2లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 30 రోజుల పాటు శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.
News February 28, 2025
కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
News February 28, 2025
ATP: రూ.2.95కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.