News March 1, 2025

శ్రీశైలంలో అలరించిన మహిళల కోలాటం

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళల కోలాటం భక్తులను అలరించింది. ముందుగా నిత్య కల్యాణ మండపంలో సదస్యం – నాగవల్లి కార్యక్రమాలు జరిపించి సదస్యం జరిపించారు. కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతిస్తారు. ఆగమ శాస్త్రం సంప్రదాయం మేరకు అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.

Similar News

News September 17, 2025

MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

image

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 17, 2025

HYD: 3 రోజులుగా అశోక్ ఆమరణ దీక్ష..!

image

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ సెప్టెంబర్ 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, నేడు మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.

News September 17, 2025

ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

image

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.