News March 1, 2025

ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్

image

ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే తాగు నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా అతిసార ప్రబలడంతో వైద్య సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్‌లను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 1, 2025

మర్రిగూడ: లైంగిక దాడి కేసులో జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తికి 16నెలల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కులకర్ణి విశ్వనాథ్ తీరునిచ్చారు. వివరాలిలా.. మర్రిగూడ మండలం శివన్నగూడెంకి చెందిన నర్సిరెడ్డి 2017లో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. 16నెలల శిక్ష, రూ.1500 జరిమానా విధించారు.

News March 1, 2025

ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: ప్రభుత్వం

image

TG: ఆధార్ లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియాలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. దీంతో పిల్‌ను ధర్మాసనం ముగించింది.

News March 1, 2025

భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!