News March 1, 2025

మహబూబాబాద్: ఎగ్ పఫ్‌ తింటున్నారా.. జర జాగ్రత్త..!

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ ఫిర్యాదు మేరకు బ్రహ్మ లింగేశ్వర బేకరీని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీలో ఎగ్ పఫ్‌లో అధికంగా ప్లాస్టిక్ ఉందని దేవేందర్ ఫిర్యాదు చేయగా అధికారి తనిఖీలు చేసి నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News March 1, 2025

ఉంగుటూరు: బర్త్ డే రోజు వాహనం ఢీకొని యువకుడు మృతి

image

జాతీయ రహదారి కైకరం వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు దుర్మరణం మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడు భీమడోలు మండలం పూళ్ళ గ్రామానికి చెందిన తులసీరాం(17).. తన పుట్టిన రోజు సందర్భంగా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2025

సిరిసిల్ల: ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట(M) కొండాపూర్‌కు చెందిన సోని(22) ప్రసవం కోసం వెళ్లి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సోని 9నెలల గర్భిణి కావడంతో గురువారం ప్రసవం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో KNRకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.

News March 1, 2025

తాండూర్: చిరుత పులి పిల్ల మృతి.. అధికారుల విచారణ

image

తాండూరు మండలం కోట‌బాస్‌పల్లి శివారులో నిన్న సాయంత్రం కొన ఊపిరితో కనిపించిన చిరుత పులి పిల్ల చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. జిల్లాలో మొన్నటి వరకు చిరుత పులి సంచారం ఆందోళన కలిగించగా.. తాజాగా పులి పిల్ల మృతి భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో పులి పిల్ల ఇక్కడి నుంచి వచ్చింది. ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేక అక్కడ చిరుత పులి పిల్లను జన్మనిచ్చిందా..?  అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

error: Content is protected !!