News March 1, 2025
జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్‌లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్‌స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.
Similar News
News January 8, 2026
ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.
News January 8, 2026
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 8, 2026
విగ్రహాల పరిమాణం ఎంత ఎత్తు వరకు ఉండవచ్చు?

ఇంట్లో విగ్రహాలు రెండున్నర అంగుళాల నుంచి 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. మరీ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి శాస్త్రోక్తంగా నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. లోహపు విగ్రహాలైతే పంచలోహాలు, వెండి లేదా రాగితో చేసినవి ఉత్తమం. విగ్రహాలకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. ఒకే దేవుడి విగ్రహాలు రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. శివలింగం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.


