News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

Similar News

News March 1, 2025

ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: ప్రభుత్వం

image

TG: ఆధార్ లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియాలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. దీంతో పిల్‌ను ధర్మాసనం ముగించింది.

News March 1, 2025

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనుంది. వీటిని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. అనంతరం వాటిని పార్లమెంటుకు పంపి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News March 1, 2025

భారత్‌లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం

image

భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

error: Content is protected !!