News March 1, 2025

రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

image

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.

Similar News

News July 7, 2025

జగిత్యాల జిల్లాలో 66 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.

News July 7, 2025

నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

image

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News July 7, 2025

ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసరని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.