News March 1, 2025
అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.
Similar News
News March 1, 2025
ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.
News March 1, 2025
కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.
News March 1, 2025
పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.