News March 1, 2025
సిరిసిల్ల: ఇంటర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మార్చి 5, నుంచి మార్చి 25వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 5065 మంది, రెండవ సంవత్సరంలో 4245 మొత్తం 9310 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకు గాను 16 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 1, 2025
సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.
News March 1, 2025
కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
News March 1, 2025
MNCL: ఏకరూప దుస్తులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తయారు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తరగతుల వారిగా విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని.. గుర్తించబడిన 630 స్వయం సహాయక సంఘాల సభ్యుల సమన్వయంతో దుస్తుల తయారీ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.