News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్‌గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News March 1, 2025
కోదాడ: కలకలం రేపుతున్న మైనర్ మిస్సింగ్

కోదాడలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా.. మేళ్లచెర్వు మండలానికి చెందిన బాలికకు కోదాడకు చెందిన పదో తరగతి అబ్బాయి స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అతడిని కలవడానికి ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి కోదాడకు వెళ్లింది. ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.