News March 1, 2025

ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

image

ట్రంప్, జెలె‌న్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.

Similar News

News March 1, 2025

‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్ట్’ అని పేరు పెట్టాలని డిమాండ్లు

image

TG: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్టు’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయులు అని, వారి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ పేరుతో క్రియేట్ చేసిన ఏఐ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా విమానాలు నడిపించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 1, 2025

ఇంటర్ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

image

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.

News March 1, 2025

కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.

error: Content is protected !!