News March 1, 2025
నిర్మల్: రంజాన్ మాసంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎస్పీ

రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ముస్లిం సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలను అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు.
Similar News
News March 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆసిఫాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆసిఫాబాద్ లో ఇవాళ, రేపు 36 నుంచి 38 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.