News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.
Similar News
News March 1, 2025
కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.
News March 1, 2025
పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.
News March 1, 2025
తీవ్ర ఉత్కంఠ.. ఆ 5 లొకేషన్లలో ఏముంది?

SLBC టన్నెల్‌లో గల్లంతైనవారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. GPR పరికరం 5 లొకేషన్లలో మెత్తటి వస్తువులు ఉన్నట్లు గుర్తించింది. అయితే అవి కార్మికుల మృతదేహాలా? లేక వేరే ఏమైనా పరికరాలా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆ 5 లొకేషన్లలో సిబ్బంది డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. 3-5 మీ. తవ్వితే అక్కడ ఏం ఉందనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.