News March 1, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News March 1, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 1, 2025
NZB: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌లో జిల్లా క్రీడాకారులు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలోని కాకినాడలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన జి. సుమన్, ఆర్.శివకుమార్ రీజినల్ స్పోర్ట్స్ బోర్డ్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుమన్ హైదరాబాదులోని ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆడిటర్‌గా, శివకుమార్ స్థానిక ఇన్కమ్ టాక్స్ ఆఫీస్‌లో ఓఎస్‌గా పనిచేస్తున్నారు.
News March 1, 2025
NZB: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు హాల్ టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు.