News March 1, 2025

కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

image

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.

Similar News

News March 1, 2025

ట్రంప్‌కు క్షమాపణ చెప్పను: జెలెన్‌స్కీ

image

ఓవెల్ ఆఫీస్ ఘటనపై ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకోవటం లేదని, అయితే అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానని ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్‌లోని ఖనిజాల తవ్వకం ఒప్పందంపై భేటీలో USనుంచి రక్షణ కావాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.

News March 1, 2025

రాజీనామా తర్వాత GV రెడ్డి తొలి ట్వీట్

image

AP: టీడీపీకి <<15567607>>రాజీనామా తర్వాత<<>> బడ్జెట్‌ను అభినందిస్తూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000cr రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుంది. తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి’ అని ట్వీట్ చేశారు.

News March 1, 2025

రాజా సాబ్.. 3 గంటలు!

image

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.

error: Content is protected !!