News March 1, 2025
నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News December 28, 2025
2025: ‘అంచనాలు’ అందుకోలేకపోయారు?

ఈ ఏడాది పలువురు టాలీవుడ్ హీరోల సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. విడుదలకు ముందు బజ్ ఉన్నా రిలీజ్ తర్వాత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విష్ణు ‘కన్నప్ప’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రవితేజ ‘మాస్ జాతర’ లిస్టులో ఉన్నాయి. ఈ ఏడాది రిలీజైన వాటిలో మిమ్మల్ని నిరాశపర్చిన సినిమా ఏంటి?
News December 28, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జనవరి 2 వరకు పొడగించారు. డిగ్రీ (సీబీసీఎస్) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు 27న ముగియగా, జనవరి 2 వరకు పొడగించారు. అలాగే పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు 500 రూపాయల ఫైన్‌తో చెల్లింపు గడువు 27న ముగియగా, దాన్ని జనవరి 2 వరకు పొడగించారు.
News December 28, 2025
MBNR: SSC, INTER.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరెందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. వచ్చేనెల 5లోగా.. ఫైన్‌తో 16లోగా అప్లై చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. www.telanganaopenschool.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు. SHARE IT


