News March 1, 2025

ఆల్‌ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News March 1, 2025

రాజా సాబ్.. 3 గంటలు!

image

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.

News March 1, 2025

ఏటేటా తగ్గుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు!

image

నల్గొండ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో జిల్లాలో 2,78,667 మంది అర్హులు ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన, భూములను అమ్ముకున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను ఏటా జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో 19వ విడతలో 1,08,651 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది.

News March 1, 2025

సంగారెడ్డి: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదంల్లో ముగ్గురు చనిపోయారు. సదాశివపేటలో వాటర్ ట్యాంకర్‌ను స్కూటీ ఢీకొన్న ఘటనలో <<15608397>>ఇంటర్ విద్యార్థి<<>> సాయికార్తీక్ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొట్టిపల్లికి చెందిన సతీశ్(29) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నాడు. జిన్నారం మం. కాజిపల్లి శివారులో క్వారీ కూలి హిటాచీ డ్రైవర్ శ్రీనివాస్(30) మృతి చెందాడు.

error: Content is protected !!