News March 1, 2025
రేపటి నుంచి దబిడి దిబిడే..

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.
Similar News
News March 1, 2025
అలాగైతే.. TDP వాళ్లంతా జైల్లో ఉండేవారు: అమర్నాథ్

AP: అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేసినట్లు TDP చెబుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. YCP అధికారంలో ఉన్నప్పుడు TDP వారు తమపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని ఉంటే, వాళ్లంతా జైల్లో ఉండేవారని చెప్పారు. కేసులకు భయపడి వైసీపీ నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధింపులపై కాకుండా పరిపాలన మీద, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
News March 1, 2025
మీ జీతం కూడా ఇండియా వల్లే: సునీల్ గవాస్కర్

దుబాయ్‌లో ఆడటం భారత్‌కు కలిసివచ్చిందన్న ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలను సునీల్ గవస్కర్ తిప్పికొట్టారు. ఓటమి అక్కసు తమ టీమ్‌పై చూపకూడదన్నారు. భద్రతాలోపాలతోనే దుబాయ్‌లో ఆడుతున్నట్లు బీసీసీఐ ముందే ప్రకటించిందన్నారు. ఐసీసీకి భారత్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందని, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. వారికొచ్చే జీతం కూడా పరోక్షంగా(నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్) భారత్ ద్వారానే అందుతుందన్నారు.
News March 1, 2025
ఆశా వర్కర్లకు CM గుడ్ న్యూస్

ఏపీలోని 42వేల మంది ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు. రిటైర్మెంట్ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచారు. అందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.10వేల జీతం వస్తోంది. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షలు పొందే అవకాశం ఉంది. వీటిపై త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.