News March 1, 2025

గుంటూరు: హైవేపై యాక్సిడెంట్.. దుర్మరణం

image

వెంకటప్పయ్య కాలనీ వీఐపీ రోడ్డు చివర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా లేక మృతిచెందిన ఇతడే వాహనాన్ని ఢీకొట్టాడా అనేది తెలియాల్సి ఉంది. 

Similar News

News March 1, 2025

గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పతకాలు

image

గుంటూరుకు చెందిన దివాకర్(80) ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన 80 సంవత్సరాల స్పోర్ట్స్ మీట్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హేమర్, జావలిన్, డిస్క్ త్రోలో వరుసగా మూడు బంగారు పథకాలను సాధించారు. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనంతపూర్‌లో జరిగిన పోటీలలో కూడా 3 బంగారపు పతకాలను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈయనను పలువురు అధికారులు అభినందించారు. 

News March 1, 2025

గుంటూరు ఛానల్‌కు నిధుల కేటాయింపు హర్షణీయం: పెమ్మసాని

image

గుంటూరు ఛానల్ విస్తరణకు బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఛానల్ పొడిగిస్తే అదనంగా 30వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించ వచ్చన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు కృష్ణా బోర్డు అధికారులతో మాట్లాడామన్నారు. సమర్థవంతమైన పరిపాలన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. రూ. 500 కోట్లతో భూములు డిజిటలైజేషన్ చేస్తామన్నారు.

News February 28, 2025

మంగళగిరి: చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

image

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్లో రూ.2000 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కమిషనర్ రేఖారాణి కి వినతిపత్రం ఇచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, అధ్యక్షులు కె శివ దుర్గారావు మాట్లాడుతూ చేనేత సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

error: Content is protected !!