News March 22, 2024
ప్రకాశం: అన్నదమ్ముల దారెటు

ప్రకాశం జిల్లాలో ఆమంచి అన్నదమ్ములు సైలెంట్ ఆసక్తి రేపుతోంది. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2019లో కరణం బలరాం చేతిలో ఓడిపోవడంతో ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ నియమించింది. తాజాగా పర్చూరు టికెట్ యడం బాలాజీకి కేటాయించింది. మరోవైపు ఆమంచి స్వాములు జనసేన నుంచి గిద్దలూరు టికెట్ ఆశించినా దక్కలేదు. సీటు రాని ఆమంచి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News September 3, 2025
ప్రకాశం: యూరియా ఇవ్వకపోతే ఒక్క కాల్ చేయండి.!

మీకు యూరియా అందడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అయితే వెంటనే కాల్ సెంటర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం రైతులను కోరారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. ఎవరైనా రైతులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే, వెంటనే 83310 57078 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News September 3, 2025
ప్రకాశం జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. రైతులను భయానికి గురిచేసేలా వ్యాపారులు ఎవరైనా ప్రవర్తించినా, అక్రమంగా యూరియాను నిల్వచేసినా, పక్కదారి పట్టించినా పీ.డీ యాక్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన CM వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తెలిపారు.
News September 3, 2025
ఒంగోలు: వీడియోలు చూసి మరీ చోరీలు.. చివరికి అరెస్ట్!

మహిళల మెడలో చైన్‌లను చోరీ చేస్తున్న చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినట్లు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీశ్ తెలిపారు. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి చోరీలకు అలవాటు పడినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అరెస్ట్ చేశామన్నారు.