News March 1, 2025
పి.గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

పి.గన్నవరం బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన ట్రక్కు ఆటో డ్రైవర్ ఇంజరపు రామకృష్ణ (37) మృతి చెందాడు. రాజమండ్రి నుంచి ఈదరాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలికిపురం నుంచి ఆలమూరు వెళ్తున్న ట్రాక్టర్ – ఆటో ఢీ కొనడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పి.గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News September 15, 2025
కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.
News September 15, 2025
మైథాలజీ క్విజ్ – 6

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత
News September 15, 2025
యూరియాను పక్కదారి పట్టించిన గన్‌మెన్ నల్గొండకి అటాచ్..!

MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ నాగునాయక్ యూరియాను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఎస్పీ నాగు నాయక్‌ను నల్గొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.