News March 1, 2025

పోచంపల్లి: ఉచిత శిక్షణ కార్యక్రమం

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాలేషన్, మొబైల్ ఫోన్ రిపేరింగ్ (సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్), ఏసీ రిప్రజెంటర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్‌పై ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు.

Similar News

News March 5, 2026

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థులు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 5, 2026

పార్వతీపురం: ఇంటర్‌ బోటనీ పరీక్షకు 392 మంది గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ పరీక్షకు 392 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు గురువారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 2282 మందికి 63 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2914 మందికి గానూ 329 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5196 మంది విద్యార్థులకు 392 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు

News March 5, 2026

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.