News March 1, 2025
సిద్దిపేట: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు:కలెక్టర్

ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. జిల్లాలో 43 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈనెల 21 నుంచి జరిగే టెన్త్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News July 5, 2025
పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.
News July 5, 2025
రాజాపేట: డైనింగ్ హాల్‌ను చూసి భయమేసింది: జిల్లా అధికారి

రాజాపేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పప్పు కూరలో పోపు సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్‌ను చూసి భయమేసిందని, ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి సున్నం వేయాలన్నారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. చదువుకునేందుకు కొన్ని అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను కోరారు.
News July 5, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.