News March 1, 2025
ఆదిలాబాద్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

ఈనెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా..18,880 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది, సెకండ్ ఇయర్ లో 9,774 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 2 సెట్టింగ్ స్క్వాడ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు హైపవర్ కమిటీని నియమించారు.
Similar News
News November 7, 2025
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల హాజరు పెంపు దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మెన్స్ట్రువల్ హైజీన్ అవగాహన, శానిటరీ ప్యాడ్ల పంపిణీ, మహువా లడ్డూల సరఫరా తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నెలా విద్యార్థినుల ఆరోగ్య స్థితిపై సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.
News November 6, 2025
జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ADB వాసి

మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా వాసికి ఆహ్వానం అందింది. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి గిరిజన భాషా పరిరక్షకులు, మేధావులు, రచయితల సదస్సులో పాల్గొనాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌కు ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి సదస్సుకు ఆహ్వానించడం ఎంతో గర్వకారణం అని కైలాస్ అన్నారు.


