News March 1, 2025
భారత్‌లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం

భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
Similar News
News March 1, 2025
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News March 1, 2025
మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.
News March 1, 2025
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.