News March 1, 2025
వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
Similar News
News November 5, 2025
జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్‌ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్‌లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.


