News March 1, 2025

వికారాబాద్‌లో పోలీస్‌ను ఢీకొట్టిన బైకర్ (PHOTO)

image

తనిఖీల్లో పోలీస్‌నే ఢీకొట్టాడు ఓ బైకర్. వికారాబాద్ నుంచి దన్నారం రూట్‌లోని కట్టెల మిషన్ వద్ద రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ బైకర్ పోలీసుల మీదకు దూసుకొచ్చాడు. తాగి దొరికిపోతానని గ్రహించిన బైకర్ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డు కృష్ణను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News November 7, 2025

ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.

News November 7, 2025

తూ.గో: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. తూ.గో జిల్లా సీతానగరం మండలానికి చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 7, 2025

డోన్‌ కర్నూలులో కలిసేనా!

image

డోన్‌ నియోజకవర్గాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాలని MLA కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి CM దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా, రెవెన్యూ డివిజన్ మార్పుచేర్పులలో భాగంగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని మంత్రి BC ప్రతిపాదించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. డోన్‌-నంద్యాల 108KM కాగా డోన్-కర్నూలు 54KM. ఈ క్రమంలో డోన్‌ కర్నూలులో కలిస్తే బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.