News March 1, 2025
ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: ప్రభుత్వం

TG: ఆధార్ లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియాలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. దీంతో పిల్‌ను ధర్మాసనం ముగించింది.
Similar News
News March 1, 2025
సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్‌లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.
News March 1, 2025
100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.
News March 1, 2025
జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.